నీకు ఆ పార్టే లేదు పెళ్ళెందుకు.. వధువును తీసుకెళ్లిన తల్లిదండ్రులు

by Disha Web Desk |
నీకు ఆ పార్టే లేదు పెళ్ళెందుకు.. వధువును తీసుకెళ్లిన తల్లిదండ్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరు తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. అలా ఇద్దరూ రెండేళ్లు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇంకేం.. మనసులు కలిశాయి.. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి మూడు ముళ్ల బంధంతో పెనవేసుకోని పోవాలని కలలు కన్నారు. పెద్దలు సైతం వీరి ప్రేమను మెచ్చి ఆశీర్వదించాలని నిశ్చయించుకున్నారు. కానీ వారి ప్రేమ, అన్యోన్యతను చూసి విధికి కూడా కన్నుకుట్టిందేమో.. అది ఆడిన వింత నాటకంలో ఆ ప్రేమికులకు కలలు తలక్రిందులయ్యాయి. ఆశీర్వాదం కాస్తా.. ఆగ్రహంగా మారింది. సినిమాను తలపించే ట్విస్ట్‌లతో సాగిన వీరి ప్రేమ వివాహంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి..!

తమిళనాడు తిరునెల్వెలి జిల్లా, వల్లీయూర్‌లోని కేశవనేరి ప్రాంతానికి చెందిన ప్రకాష్ ప్రైవేట్ ఉద్యోగి. అతడికి పక్క గ్రామంలో ఉండే దీప అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మరి రెండేళ్లు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రకాష్, దీపల పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. ప్రకాష్‌ యాక్సిడెంట్‌కు గురై రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. దీంతో ప్రకాష్ వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు. అయితే ప్రమాదానికి గురైన వారిద్దరిలో ప్రేమ తగ్గలేదు. ప్రకాష్‌కు కాళ్లు లేకపోయినా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఈ సారి వీరి పెళ్లికి దీప కుటుంబసభ్యులు అడ్డుచెప్పారు. అయినా దీప అతడే కావాలని.. పెళ్లంటే అతడినే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది. దీంతో ప్రకాష్ కుటుంబసభ్యుల సహాయంతో గత వారం వీరిద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దీప కుటుంబసభ్యులు ప్రకాష్ ఇంటిపై దాడి చేశారు. కాళ్లు లేని నీకు నా కూతురితో ప్రేమ పెళ్లి కావాలా అంటూ ప్రకాష్‌ను కొట్టి దీపను తీసుకెళ్లి పోయారు. దీంతో ప్రకాష్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ విషా ప్రేమ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.

మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారం..


Next Story

Most Viewed