- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
టీమిండియా స్టార్ బ్యాట్స్మేన్ తండ్రి మిస్సింగ్.!

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టీమిండియా బ్యాట్స్మేన్ కేదార్ జాదవ్ తండ్రి మహాదేవ్ జాదవ్ మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు కేదార్ జాదవ్ కటుంబ సభ్యులు పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని కొత్రూడ్ ప్రాంతానికి చెందిన మహాదేవ్ జాదవ్ ఉదయం సెక్యూరిటీ గార్డును బురిడీ కొట్టించి బయటకు వెళ్లారు. అయితే కొంత సమయం తర్వాత ఆయన కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ గార్డును అడిగారు. సెక్యూరిటీ సిబ్బంది నుంచి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కొంత ఆయనకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది.
దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల వెతికించారు. అయినా ఫలితం లేకపోవడంతో పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాదవ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. మహాదేవ్ జాదవ్ చివరిసారిగా కార్వే నగర్ లో కనిపించినట్లు గుర్తించారు. కాగా మహాదేవ్ జాదవ్ డెమెన్షియా (మతిమరుపు) వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.