పేకాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి...భారీగా నగదు స్వాధీనం

by Sridhar Babu |
పేకాల స్థావరంపై  టాస్క్ ఫోర్స్ బృందం దాడి...భారీగా నగదు స్వాధీనం
X

దిశ, హనుమకొండ : పేకాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ బృందంకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఎన్జీఓ ఎస్ కాలనీ ఏరియాలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ. 51, 610 , ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల కోసం సుబేధారి పోలీసులకు అప్పగించారు. అరెస్టయిన వారిలో కొండా కిషన్ ప్రసాద్, చెన్న విజయ్, బాదాసు వెంకటేశ్వర్లు, పానకటి ప్రవీణ్ రెడ్డి, పల్లె రాజేశ్వరి రెడ్డి, గిల్లపల్లి చిరంజీవి, పల్లా ప్రశాంత్ కుమార్ ఉన్నారు. నిందితులను పట్టుకున్న వారిలో ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సరళ రాజు, టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు.

Advertisement
Next Story