- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంఎల్ఆర్ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
దిశ, దుండిగల్ : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో ఓ విద్యార్థిని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా మైలారం కొత్త తండాకు చెందిన బలరాం కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణి(18) దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ కళాశాల మెయిన్ క్యాంపస్ లో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ కళాశాల హాస్టల్ లో ఉంటుంది. ఉదయం క్లాస్ కు వెళ్లాల్సి ఉండగా కడుపు నొప్పు ఉందంటూ తోటి విద్యార్థులకు చెప్పి గదిలోనే ఉంది.
మధ్యాహ్నం క్లాస్ నుండి వచ్చిన తోటి విద్యార్థినులు రూమ్ కు గడియ పెట్టి ఉండగా తలుపులు కొట్టగా తెరవక పోవడంతో కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. తలుపు తెరిచిన యాజమాన్యం అమ్మాయి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించి దుండిగల్ పోలీస్ లకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు మృతదేహాన్ని సూరారం లోని మాల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దుండిగల్ సీఐ సతీష్ ను వివరణ కోరగా కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అమ్మా నన్ను క్షమించు అనే సూసైడ్ నోట్ లభించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుపారు.
కళాశాల ముందు కుటుంబ సభ్యులు ధర్నా...
కాళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సాయంత్రం వారు అక్కడికి చేరుకొని కాలేజీ ముందు ధర్నా చేశారు. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, రాత్రి తమతో ఫోన్ లో మాట్లాడిందన్నారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యుల ధర్నాతో కళాశాల ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ లు కుటుంబ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గిరిజన మహిళ కావడం, బాధితులు భారీగా చేరుకోవడంతో పోలీస్ లు భారీ బందోబస్తు కల్పించారు.