- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
హాస్టల్ కి వెళ్లడం ఇష్టం లేకే అలా చేసిందా..

దిశ, కాసిపేట : మండలంలోని గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన పెంద్రం అంకిత (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. వివరాల్లోకెళితే మండలంలోని గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన పెంద్రం కిషన్ పెద్దకూతరు పెంద్రం అంకిత ఆసిఫాబాద్ లోని ఎస్టీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన అంకిత అప్పటి నుండి హాస్టల్ కు వెళ్లడం లేదు.
ఇంటి వద్దనే ఉంటుండంతో అంకిత తల్లిదండ్రులు హాస్టల్ కు వెళ్ళాలని నచ్చచెప్పే ప్రయత్న చేశారు. హాస్టల్ కు వెళ్లడం ఇష్టంలేని అంకిత సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడింది. పెంద్రం కిషన్ నిద్రలేచి చూసేసరికి అంకిత ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు. చిన్నతనంలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.