ఆమె స్నానం చేస్తూనే మర్డర్.. 28 రోజుల బిడ్డ హత్యకు తల్లి సూపర్ స్కెచ్..

by Disha Web |
ఆమె స్నానం చేస్తూనే మర్డర్.. 28 రోజుల బిడ్డ హత్యకు తల్లి సూపర్ స్కెచ్..
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లి అంటే దైవంతో సమానం అంటారు. బిడ్డలకు ఏ చిన్న ఆపద వచ్చినా తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడుకుంటున్న ఘటనలు కూడా చూశాం. ఇటీవలే ఓ తల్లి పులితో పోరాడి తన బిడ్డను కాపాడుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసందే. అలాంటి మహామూర్తులు ఉన్న సమాజంలో.. బిడ్డలను చంపుకునే తల్లులు కూడా ఉండటం దౌర్భాగ్యం. ఓ తల్లి మూర్ఖంగా ప్రవర్తించి తన సొంత బిడ్డనే పొట్టన పెట్టుకుంది. పైగా మంచంపై నుండి పడి చనిపోయిందంటూ కథా అల్లి అందరిని నమ్మించింది. ఏడాది క్రితం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

నర్మదాపురానికి సమీపంలో ఉన్న ఖోజన్‌పూర్‌కు చెందిన దుర్గేష్, పూజా దంపతులకు కొడుకు (5), కుమార్తె(3) ఉన్నారు. అయితే ఏడాది క్రితం మూడో ప్రసవంలో పూజ మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. గతేడాది డిసెంబర్ 7న మధ్యాహ్నం సమయంలో పూజ ఇంట్లో ఒక్కతే తన 28 రోజుల కూతురితో ఉంది. భర్త, అత్త పని ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి 28 రోజుల చిన్నారి మరణించి ఉంది. ఏం జరిగిందని పూజను ప్రశ్నించగా.. పాపని మంచంపై పడొకోబెట్టి.. నేను స్నానం చేసి వచ్చేసరికి బిడ్డ కింద పడి మరణించిందని ఏడ్చుకుంటూ చెప్పింది. అయితే పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమి చంపినట్లు రిపోర్ట్‌లో తేలింది. కాగా.. పోలీసుల పూజను తమదైన శైలిలో విచారించగా.. తానే హత్య చేసినట్లు నిజం ఒప్పుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమయంలో మరో ఆడనపిల్లను పెంచడం భారం అవుతుందని ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పింది. దాదాపు 9 నెలలు ఈ కేసును విచారించగా.. తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిడ్డను కిరాతంగా చంపిన తల్లికి యావజ్జీవ ఖైదు విధిస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

ఆమె స్నానం చేస్తూనే మర్డర్.. 28 రోజుల బిడ్డ హత్యకు తల్లి సూపర్ స్కెచ్.

Next Story

Most Viewed