Cyber ​​Security Director: ఫోన్‌కు వచ్చే ఆ లింక్స్‌ ఎవరూ క్లిక్ చేయొద్దు

by Gantepaka Srikanth |
Cyber ​​Security Director: ఫోన్‌కు వచ్చే ఆ లింక్స్‌ ఎవరూ క్లిక్ చేయొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ సైబర్ ముఠా(Rajasthan Cyber ​​Gang)పై దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా 2,223 కేసులు నమోదు కాగా, కేవలం తెలంగాణలోనే 189 పైగా నమోదు అయినట్లు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్‌(Cyber ​​Security Director Shikha Goyal) తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సైబర్ నేరా(cyber crime)లపై వివరించారు. మొత్తం 29 నకిలీ ఖాతాల ద్వారా రూ.11.01 కోట్లు లూటీ చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన 20 మంది నిందితుల నుంచి 31 సెల్‌ఫోన్లు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎమ్ కార్డులు, 7 చెక్‌బుక్‌లు, 2 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో నమోదైన 189 కేసుల్లో రూ.9 కోట్లు కాజేసినట్లు తెలిపారు. నగరాల్లో పోలీసుల నిఘా పెరగడంతో నేరగాళ్లు గ్రామాలకు వెళ్లినట్లు గుర్తించారు. మారుమూల గ్రామాల్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఫోన్‌లకు ఏవైనా అనుమానిత లింక్స్ వస్తే ఎవరూ క్లిక్ చేయొద్దని సూచించారు. ఏదైనా లింక్‌పై అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు. దక్షిణ ఆసియా దేశాలు సైబర్ నేరాలకు హబ్‌లు మారాయని అన్నారు. రాజస్థాన్ ముఠా రాష్ట్రంలో భారీగా సైబర్ నేరాలకు పాల్పడిందని తెలిపారు. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్‌ సెంటర్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed