ట్రాక్టర్ ఢీకొని గొర్ల కాపరి దుర్మరణం

by Sridhar Babu |
ట్రాక్టర్ ఢీకొని గొర్ల కాపరి దుర్మరణం
X

దిశ, బోయినిపల్లి : ట్రాక్టర్ ఢీకొని గొర్ల కాపరి మృతి చెందిన ఘటన బోయినిపల్లి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన సురకాని మల్లేశం (45 ) గొర్ల మంద వద్దకు వెళ్తుండగా రామన్నపేటకు చెందిన ట్రాక్టర్ ఢీకొంది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందాడని నిర్దారించారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని బోయినిపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు ధర్నా చేపట్టారు.

నేరస్తున్ని తమకు అప్పగించి, వెంటనే మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. ధర్నా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమించాలని మృతుని కుటుంబ సభ్యుల్ని కోరగా పోలీసులకు, గ్రామస్తులకు వాగ్వాదం జరిగింది. స్థానిక ఎస్సై పృథ్విధర్ గౌడ్, రూరల్ సీఐ శ్రీనివాస్, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ అక్కడకు చేరుకొని ఎంత చెప్పినా గ్రామస్తులు వినకపోవడంతో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి రంగంలోకి దిగి మృతుని కుటుంబానికి సత్వర న్యాయం చేసేలా, నేరస్తుని బంధువులను పిలిపించి మాట్లాడారు. దాంతో మృతుని కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు.



Next Story