పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు..

by Kalyani |
పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు..
X

దిశ, జడ్చర్ల: పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలైన ఘటన సోమవారం సాయంత్రం జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం కోడుగల్ గ్రామంలో దారిలో వెళ్లిన వారిపై పిచ్చికుక్క ఎగబడి విచక్షణ రహితంగా దాడి చేసింది. దీంతో గ్రామానికి చెందిన నలుగురు వృద్ధులు, ఓ బిహారి కూలి, ఓ రెండేళ్ల చిన్నారి లు కుక్క కాటుకు గురయ్యారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జడ్చర్ల వంద పడకల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పిచ్చికుక్క వీరంగంతో గ్రామస్తులు ఓక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

గత కొన్ని రోజులుగా గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని. దారిన పోయేవారి వెంట కుక్కలు పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని గ్రామంలోని కుక్కల బెడదను అరికట్టాలని గ్రామ పాలకులకు అనేకమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వారి నిర్లక్ష్యం కారణంగానే నేడు గ్రామంలోని ఏడుగురిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామంలో కుక్కల బెడదను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.Next Story

Most Viewed