శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..

by Disha Web Desk 13 |
శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..
X

దిశ, శంషాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని సంగారెడ్డికి గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో బుధవారం శంషాబాద్ పోలీసులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేశారు. శంషాబాద్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ కుమార్ ఆదేశాల మేరకు ఎసై శివకుమార్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బ్రీజా కార్ లో ఒక్కొక్క ప్యాకెట్ ఐదు కిలోల బరువు కలిగిన 14 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. కారులో పూర్తిగా 71 కిలోల 620 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 35.07 లక్షలు ఉంటుందన్నారు. కారు నడిపిస్తున్న డ్రైవర్ మారుతి రాథోడ్ సంగారెడ్డి జిల్లా సిగ్గవరపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందినవాడు.

ఇతని పై గతంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న కేసులు ఉన్నాయని జైలుకు వెళ్లి వచ్చిన బుద్ధి మారలేదన్నారు. మారుతి రాథోడ్ పాత నేరస్తులైన జైపాల్, మల్లికార్జున్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయిని నారాయణఖేడ్ కు ట్రాన్స్ పోర్ట్ చేసి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. అదేవిధంగా మారుతి రాథోడ్ గంజాయి జైపాల్ కు ఇవ్వడానికి మారుతి బ్రీజా (TS 08 GS 8383) కారులో ఆంధ్రప్రదేశ్ నుండి నారాయణఖేడ్ కు ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా పక్కా సమాచారంతో పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుకున్నామన్నారు. ఇతని పై కేసు నమోదు చేసి ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని తెలిపారు.


Next Story

Most Viewed