- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
రౌడీ షీటర్ ఆత్మహత్య.. అతడి అంత్యక్రియలకు వెళ్లిన స్నేహితుడు హత్య

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలో ఒకే రోజు జరిగిన రెండు ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఉదయం ఓ ఆత్మహత్య.. సాయంత్రం మరో హత్య జరిగి బెజవాడ పోలీసులకు సవాల్‌గా మారింది. మృతులు ఇద్దరు కూడా స్నేహాతులు కావడం గమనార్హం. వీరిలో ఒకరు రౌడీ షీటర్ ఆత్మహత్యకు పాల్పడగా.., అంత్యక్రియల్లో పాల్గొన్న ఫుడ్ బాల్ ప్లేయర్ హత్యకు గురి కావడం కలకలంగా మారింది. ఈ రెండు వరుస ఘటనలపై రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీంలు వేగంగా దర్యాప్తు చేపట్టాయి. ఇంతకూ ఏం జరిగిందంటే..?
బెజవాడలోని వాంబేకాలనీకి చెందిన రౌడీషీటర్ ఓయభాను శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో అతడి ఇంట్లోనే ఉరివేసుకొని మృతి చెందాడు. టోనీ స్థానికంగా ఉండే మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే టోనీ అంత్యక్రియల్లో పాల్గొన్న జక్కంపూడికి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాష్ అదే రోజు సాయంత్రానికి దారుణ హత్యకు గురయ్యాడు. అంత్యక్రియల్లో జరిగిన వివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆకాష్‌తో టోనీ అనుచరులు మార్చురీ సమీపంలో ఉన్న ఒక బార్ వద్ద గొడవ పడ్డారు. అనంతరం ఆకాష్‌ను గురునానక్ కాలనీలోని స్నేహితుడి అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లి కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఉదయం రౌడీ షీటర్ ఆత్మహత్య, ఆ తరువాత కొద్ది సేపటికి అతని స్నేహితుడిగా ఉన్న ఫుడ్ బాల్ ప్లేయర్ దారుణంగా హత్యకు గురి కావటం వెనుక బలమయిన కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గంజాయి బ్యాచ్‌తో పాటుగా డ్రగ్స్ వంటి కేసులు పోలీసులకు సవాల్ గా మారాయి. ఈ నేథప్యంలో రౌడీషీటర్ ఆత్మహత్య, ఆ తరువాత మరో హత్య జరగటం చూస్తుంటే బెజవాడలో క్రైం రేట్‌తో పాటుగా,శాంతి భద్రతలపై ప్రభావం చూపుతున్నాయని ఖాకీలు భావిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.