గంజాయిని పట్టించిన రోడ్డు ప్రమాదం..! ముగ్గురు యువకులకు గాయాలు

by Disha Web |
గంజాయిని పట్టించిన రోడ్డు ప్రమాదం..! ముగ్గురు యువకులకు గాయాలు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు చెకింగ్‌లో భాగంగా ఓ కారు‌ను చెకింగ్ చేస్తుండగా అందులో గంజాయి ఉందని అనుమానించిన పోలీసులు కారు ఆపేందుకు ప్రయత్నించారు. కారు తప్పించుకొని వెళ్తున్న క్రమంలో పోలీసులు వెంటపడేసరికి కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్ రోడ్ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టి కారు ఆగింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సూరజ్, శివం, అభిషేక్ మాన్వియాలకు గాయాలయ్యాయి. కాగా ఈ సంఘటనలో బోల్తా పడిన కారులో సుమారు 30 నుండి 40 కిలోల గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కారు బోల్తా పడిన తరువాత స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు కారుని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్లు సమాచారం. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. .ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed