ముగ్గురు మహిళలపై అత్యాచారం.. స్టార్ హీరోకు 30 ఏళ్ల జైలు శిక్ష

by Rajesh |
ముగ్గురు మహిళలపై అత్యాచారం.. స్టార్ హీరోకు 30 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరోకు 30 ఏళ్ల జైలు శిక్ష పడటం సంచలనంగా మారింది. 2001-03 మధ్యలో హాలీవుడ్ నటుడు డానీ వరుసగా మూడు సార్లు ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. రెండు కేసుల్లో అతడు దోషిగా తేలాడు. మూడో కేసులో తీర్పు రావాల్సి ఉంది. న్యాయస్థానం తీర్పు ప్రకటించే సమయంలో డానీ మౌనంగా ఉండిపోయాడు. అతని భార్య, నటి ఫిలిప్స్ మాత్రం బోరున విలపించారు. డానీ మాస్టర్ సన్ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2003 చివరలో మరో యువతి(23) పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో 2020 జూన్ లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పట్లో జైలు శిక్ష విధించింది. అయితే 3.3 మిలియన్ డాలర్లు చెల్లించి డానీ బయటకు వచ్చారు. తాజాగా ఈ కేసుల్లో విచారణ జరగగా కోర్టు డానీని నిందితుడిగా తేల్చింది. రెండు అత్యాచారాల్లో డానీపై నేరం రుజువైంది. మరో కేసులో ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. లైంగిక వేధింపుల కారణంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘ద రాంచ్’ అనే కామెడీ షో నుంచి డానీని తొలిగించింది. 1998లో లాంచ్ అయిన రెట్రో సిట్ కామ్ దట్ సెవెంటీస్ షో తో డానీ మాస్టర్ సన్ పాపులారిటీ సంపాదించారు.

Next Story

Most Viewed