- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దపల్లిలో రైల్వే సిబ్బందికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే కూలీలు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ట్రాక్ రిపేర్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా ట్రాకింగ్ మిషన్ పట్టాలు తప్పింది.

దిశ, వెబ్ డెస్క్: పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే కూలీలు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ట్రాక్ రిపేర్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా ట్రాకింగ్ మిషన్ పట్టాలు తప్పింది. అది ఊహించని విధంగా పనిచేస్తున్న కూలీలపైకి దూసుకువెళ్లడంతో వాళ్లంతా అక్కడ నుండి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో భారీ ట్రాకింగ్ మిషన్ పట్టాలు తప్పడం వల్ల రైలు పట్టాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. కూలీలు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా ట్రాకింగ్ మిషన్ లపై నలుగురైదుగురు కార్మికులు ఎక్కి పట్టాల పరిస్థితి ఎలా ఉంది. ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందా.. రిపేర్ పనులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు వాడుతుంటారు. పట్టాల చెకింగ్ కోసం దానినే వాడుతుంటారు.






