ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్న ఆస్తి తగాదాలు

by Disha Web |
ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్న ఆస్తి తగాదాలు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసినవారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లో కెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి.ఈ కలహాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే కుటుంబ పెద్ద అయిన శాంతమ్మ, రూపలను సాంబశివరావు, మల్లేశ్వరరావు అనే వ్యక్తులు నరికి చంపేశారు. వీరిపై దాడి చేస్తుండగా అడ్డుకున్న నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు నాగరాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్తి వివాదాలు వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed