1.25 కిలోల గంజాయి పత్తివేత..

by Disha Web |
1.25 కిలోల గంజాయి పత్తివేత..
X

దిశ, మందమర్రి : మందమర్రి టోల్ ప్లాజావద్ద ఇద్దరు అమ్మకం దారులను మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఎస్సైలు అశోక్, లచ్చన్నలు పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వీరి కథనం ప్రకారం మంచిర్యాల జోన్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతకాలంగా గంజాయి ఇతర ప్రాంతాల నుండి తీసుకు వస్తున్నారనే సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఎస్సై అశోక్, లచ్చన్న సిబ్బందితో కలిసి మందమర్రిలోని టోల్ ప్లాజా వద్ద మాటు వేసినట్లు తెలిపారు.

అక్కడ ఇద్దరు విద్యార్థులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకోని ప్రశ్నించినట్లు వివరించారు. నిందితులు చెప్పిన సమాచారం మేరకు మంచిర్యాల రెడ్డి కాలనీలోని ఒక ఇంటిని తనిఖీ చేయగా అందులో 1.25 కిలోల గంజాయి దొరికినట్లు చెప్పారు. కాగా ఇద్దరు నిందితులను, గంజాయి, ఒక మొబైల్ ఫోన్ తో పాటు పల్సర్ బైక్ లను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు పేర్కొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక మైనర్ ఉండగా మరొకరు 19 సంవత్సరాల దుగుట ప్రశాంత్ ఉన్నట్లు వారుస్పష్టం చేశారు.
Next Story