యువతులతో అశ్లీల నృత్యాలు.. వైల్డ్ హార్ట్ పబ్ పై పోలీసుల దాడులు

by Sumithra |
యువతులతో అశ్లీల నృత్యాలు.. వైల్డ్ హార్ట్ పబ్ పై పోలీసుల దాడులు
X

దిశ, చైతన్య పురి : నిబంధనలకు విరుద్ధంగా యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న వైల్డ్ హార్ట్ పబ్ పై చైతన్యపురి పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి యువతులను, డీజేను అదుపులోకి తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తివివరాల్లోకెళితే చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ ప్రధాన రహదారి పై ఉన్న వైల్డ్ హార్ట్ పబ్ నిబంధనలు అతిక్రమించి సమయానికి మించి పబ్ నడుపుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు.

యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తున్నారని గమనించారు. కపుల్స్ తో కాకుండా ఒంటరిగా ఉన్న కస్టమర్లని యువతులతో ట్రాప్ చేయించి అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఆకట్టుకునేలా ముంబై నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ యజమాని కస్టమర్స్ కి ఎర వేసి డబ్బులు దండుకుంటున్నట్లు గమనించి నృత్యాలు చేస్తున్న 16 మంది యువతులని, ఒక డిజేను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పబ్ యజమాని, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చైతన్యపురి ఇన్స్ పెక్టర్ జి.వెంకటేశ్వర్ రావు తెలిపారు.

Next Story

Most Viewed