లింక్ వచ్చిందని క్లిక్ చేస్తే.. నగ్నంగా ఫోటోలు..

by Disha Web Desk 20 |
లింక్ వచ్చిందని క్లిక్ చేస్తే.. నగ్నంగా ఫోటోలు..
X

దిశ, రాచకొండ : పర్సనల్ లోన్ లింక్ వచ్చిందని క్లిక్ చేసి ఓ ప్రైవేట్ ఉద్యోగి 19 లక్షల రూపాయలు లోన్ యాప్ వేధింపుదారులకు చెల్లించుకున్నాడు. చివరకు వేధింపులను తట్టుకోలేక రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం బోడుప్పల్ మల్లికార్జున్ నగర్ ప్రాంతానికి చెందిన (35) ప్రైవేట్ ఉద్యోగి. గత ఏడాది మే నెలలో అతని ఫోన్ కి రూ. 2500 పర్సనల్ లోన్ ఇస్తామని ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ ను క్లిక్ చేయగానే హ్యాండీ లోన్ యాప్ లో కి వెళ్ళింది. 2500 లోన్ తీసుకున్నాడు. 7 రోజుల తర్వాత లోన్ యాప్ వారు ఫోన్ చేసి 5 వేలు కట్టాలని వేధింపులు ప్రాభించారు.

దీంతో దిక్కు తోచని ప్రైవేట్ ఉద్యోగి మరో యాప్ లోన్ నుంచి డబ్బులు తీసుకుని కట్టాడు. ఇలా దాదాపు 11 నెలలో ప్రైవేట్ ఉద్యోగి మొత్తం 11.08 లక్షల రూపాయలు తీసుకునందుకు 19.65 లక్షల రూపాయలను చెల్లించాడు. ఇక తన స్థాయికి మించి అప్పులు కావడంతో ప్రైవేట్ ఉద్యోగి శుక్రవారం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసునమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ను ప్రారంభించారు. కేవలం తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని స్నేహితులు, బంధువులు, సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయడం తో ప్రైవేట్ ఉద్యోగి భయపడి పరువుపోతుందని కలవరానికి గురై అప్పులు చేసి చెల్లించినట్లు పోలీసులకు వివరించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed