ట్రాక్టర్, బైక్ ఢీ ఒకరు మృతి..

by Disha Web |
ట్రాక్టర్, బైక్ ఢీ ఒకరు మృతి..
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా దేశిటిక్యల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన ఆకాష్(20), తండ్రి వెంకటయ్య ఇరువురూ నూతనంగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాన్ని రిజిస్ట్రేషన్ కోసం నాగర్ కర్నూల్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ అనంతరం స్వంత గ్రామానికి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో కొల్లాపూర్ నుండి నాగర్ కర్నూల్ వైపు వస్తున్న పొట్టు తరలిస్తున్న ట్రాక్టర్ దేశిటిక్యాల గ్రామ శివారులో ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story

Most Viewed