- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
మితిమీరిన వేగానికి యువకుడు బలి
by Disha Web |

X
దిశ, బిచ్కుంద: అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీయగా.. మరో వ్యక్తికి గాయలకు కారణం అయింది. ఖత్గవ్ గ్రామ శివారులో వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తుమ్మ చెట్టుకు ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న లింగం (28) అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా బైక్ పై ఉన్న రమేష్ (30) స్వల్ప గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ ముగ్దుంపురం గ్రామానికి చెందిన తిమ్మా నగర్ లింగం(28), మిద్దింటి రమేష్ (30)లు శనివారం రాత్రి డోంగ్లి గ్రామంలో మేస్త్రి పని ముగించుకుని తిరిగి వారి ఊరికి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు లింగం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది అని బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.
Next Story