- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ బైక్ ఢీకొని ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
అతివేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ వ్యక్తి పాలిట మృత్యు వాహనంగా మారి బైక్ పై వెళ్తున్న వారిని ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరు గాయాలపాలైన సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది.

దిశ తాండూరు రూరల్: అతివేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ వ్యక్తి పాలిట మృత్యు వాహనంగా మారి బైక్ పై వెళ్తున్న వారిని ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరు గాయాలపాలైన సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి వికాట్ సాగర్ సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన బైకుపై ధారూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన బాబుతో కలిసి బైకుపై కాలనీ నుంచి బయల్దేరాడు. సీసీఐ కాలనీ వద్ద మలుపు తిరిగే క్రమంలో గౌతాపూర్ వైపు నుంచి వస్తున్న నాపరాతి లోడ్ ట్రాక్టర్ వేగంగా వస్తూ బైకును ఢీకొట్టింది. దీంతో బైకు పైనుంచి ఇద్దరు కింద పడిపోయారు. వెనుకాల కూర్చున్న రాధాకృష్ణ కాలుపై నుంచి ట్రాక్టర్ వెనుక టైరు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కాలు విరిగిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే క్రమంలో బాబుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాధాకృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మార్గమధ్యలో రాధాకృష్ణ మృతి చెందాడు. ఈ సంఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని భార్య మనోజ్ఞ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.






