ఆస్ట్రేలియా యువతి హత్య: భారతీయుడి అరెస్ట్.. రివార్డు ఎంతో తెలుసా?

by Disha Web Desk 4 |
ఆస్ట్రేలియా యువతి హత్య: భారతీయుడి అరెస్ట్.. రివార్డు ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా యువతిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో ఓ యువతి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రజ్వీందర్ సింగ్(38) ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 2018 అక్టోబర్ 21న క్వీన్స్ లాండ్ బీచ్ లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ అనే యువతి హత్య చేయబడింది. కాగా ఈ హత్య ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో నిందితుడు రజ్వీందర్ సింగ్ రెండు రోజులకే దేశం వదిలి పారిపోయాడు.

భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఇండియాకి వచ్చేశాడు. ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. పంజాబ్ లోని అమృత్ సర్ బటర్ కలాన్ కు చెందిన రజ్వీందర్ ఆస్ట్రేలియాలో ఉండేవాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేసేవాడు. 2021 మార్చిలో రజ్వీందర్ సింగ్ ను తమకు అప్పగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ ను కోరింది. ఈ నేపథ్యంలో రజ్వీందర్ పై రూ.5 కోట్ల రివార్డు(1మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు)ను ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పోలీసులు ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసులు రజ్వీందర్ ను పట్టుకున్నారు.


Next Story

Most Viewed