కలిసి బెట్టింగ్ వేసిన తల్లీకొడుకులు.. గెలవకపోవడంతో దారుణం..

by Javid Pasha |
కలిసి బెట్టింగ్ వేసిన తల్లీకొడుకులు.. గెలవకపోవడంతో దారుణం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ను చాలా మంది వినోదానికి చూస్తే కొందరు మాత్రం ఫ్రీమనీ కోసం బెట్టింగ్ బాట పడుతుంటారు. కానీ బెట్టింగ్ వేసే కుర్రకారు ఆ విషయాన్ని మూడో కంటికి తెలియకుండా ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. ఒకవేళ వారి తల్లిదండ్రులకు తెలిసిందంటే ఇక అంతే సంగతులు. కానీ ఒడిశాలో మాత్రం తల్లీ కొడుకులు ఇద్దరూ కలిసి క్రికెట్ బెట్టింగ్‌లు వేశారు. 55 ఏళ్ల తల్లి, 22 ఏళ్ల కుమారుడు కలిసి ఐపీఎల్ బెట్టింగ్‌లో యమజోరుగా పాల్గొన్నారు. కానీ వారికి బెట్టింగ్ అనుకున్నంతగా కలిసి రాలేదు. తమదగ్గర ఉన్నదంతా వారు బెట్టింగ్‌లో కోల్పోయారు. దాంతో తల్లీ కొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆమె కొన్నేళ్ల క్రితం తన కూతురు వివాహం కోసం అప్పులు చేసిందని, వారికి తిరిగి కట్టడంలో ఆమె తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుందని, అందుకే బెట్టింగ్ బాట పట్టిందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె దాదాపు 3 రోజుల నుంచి ఏమీ తినలేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed