- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఉద్యోగానికి వెళ్లిన యువతి అదృశ్యం
by Aamani |
X
దిశ, మొయినాబాద్ : మహిళ అదృశ్యం అయిన సంఘటన మొయినాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన బంటు మానస (19) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. సోమవారం ఉద్యోగ రిత్యా తన అన్న బంటు మహేందర్ సోమవారం ఉదయం అజీజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద అతని బైక్ పై డ్రాప్ చేసి వెళ్ళాడు. జాబ్ కి వెళ్లిన తన చెల్లి మానస సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళిందేమని వెతికాడు. కానీ ఆచూకీ తెలియకపోవడంతో బంటు మహేందర్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story