మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన మహిళా అదృశ్యం..

by Disha Web Desk 11 |
మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన మహిళా అదృశ్యం..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: మార్నింగ్ వాకింగ్ కోసం అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్ పల్లి మల్లికార్జున కాలనీ రోడ్ నెంబర్ వన్ లో నివాసం ఉంటున్న సూరజ్ సింగ్ భార్య రేష్మా సింగ్ (47) మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో తనకు కడుపునొప్పి రావడం జరిగింది. దీంతో నీరు తాగిన రేష్మా సింగ్ ఇంట్లోనే కాసేపు వాకింగ్ చేసింది.

అయినా కడుపునొప్పి తగ్గలేదు. దీంతో భర్త సూరజ్ సింగ్ ఇంట్లో లేకపోవడం తో ఇంట్లో పడుకుని ఉన్న తన కుమార్తె ను నిద్ర లేపి తనకు కడుపు నొప్పిగా ఉందని బయటకు వెళ్లి వాకింగ్ చేసి వస్తాను అని చెప్పి సుమారు 3.20 ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్త తల్లి కోసం కూతురుని అడిగాడు. దీంతో జరిగిన విషయం తండ్రికి వివరించింది కూతురు. ఈ క్రమమంలో భార్య రేష్మా సింగ్ కోసం చుట్టు ప్రక్కన ప్రాంతాలను వెతికాడు. తెలిసిన వారిని సంప్రదించాడు. దగ్గర లో ఉన్న ఆసుపత్రిలలో కూడ ఆరాతీసారు. అయినా ఫఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చిన భర్త సూరజ్ సింగ్ బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story