- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు

దిశ, వరంగల్ : వరంగల్ పోలీస్ పోలీస్ కమిషనరేట్ లో 9 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఏజే మిల్స్ కాలనీ పోలీసులు జనవరి నెలలో కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 21వ తేదీన తన భూమిని కబ్జా చేశారని జయశ్రీ అనే మహిళ ఫిర్యాదు చేయగా, కనీస విచారణ చేపట్టకుండా 9 సంవత్సరాల క్రితం మరణించిన బత్తిని చంద్రశేఖర్ అనే వ్యక్తిపై మిల్స్ కాలనీ పోలీసులు ఎఫ్ఐఆర్ (47/2025) నమోదు చేశారు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇదేంటని చంద్రశేఖర్ చనిపోయి తొమ్మిది సంవత్సరాల అయిందని కేసు నమోదు చేస్తారని సదరు అధికారిని అడగగా రెచ్చిపోయిన ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కుటుంబ సభ్యులపై ఆగ్రహం తెచ్చుకుని ప్రశ్నిస్తే మీపై కూడా కేసు నమోదు చేస్తామని బెదిరించాడని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేశారని ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని భూదందాలకు పాల్పడుతున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.