రాష్ట్రంలో భారీగా కిడ్నీల కుంభకోణం.. డాక్టర్ బొంగు రమేశ్ సంచలన ఆరోపణలు

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో భారీగా కిడ్నీల కుంభకోణం.. డాక్టర్ బొంగు రమేశ్ సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కిడ్నీల కుంభకోణం జరుగుతున్నదని మెడికల్ జాక్ చైర్మన్ డాక్టర్ బొంగు రమేష్ ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రులతో డీఎంఈ కుమ్మక్కై అవయవ మార్పిడిలపై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి లైవ్​ట్రాన్స్​ప్లాంటేషన్లపై సరైన లెక్కలు లేవన్నారు. ఆఫ్రికన్​దేశాల నుంచి వేల మంది హైదరాబాద్‌కు వచ్చి లివర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు చేయించుకుంటున్నా, వైద్యశాఖ వద్ద వివరాలు లేకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు కొమ్ము కాయడం వలనే ఇలాంటి పరిస్థితి ఉన్నదన్నారు. లైవ్ ట్రాన్స్ ప్లాంటేషన్లపై సీబీఐ, సీఐడీ ఎంక్వైరీ జరగాలని కోరారు.

ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వత్తాసు పలకడం వల్లే డీఎంఈకి సీఎంవో నుంచి అండ లభిస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ పట్టణంలో గడిచిన ఐదేళ్ల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్లు విపరీతంగా పెరిగాయన్నారు. దీన్ని అవకాశంగా మాల్చుకొని కోన్ని ప్రైవేట్, కార్పొరేట్​ ఆసుపత్రులు కోట్ల రూపాయలు దండుకుంటున్నాయన్నారు. ఆయా ఆసుపత్రులకు అండగా డీఎంఈ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆఫీసర్లు చేస్తున్న తప్పిదాలను ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. వైద్యశాఖలో కొందరు ఆఫీసర్లు వైఖరి వలన సర్కార్‌కు చెడ్డ పేరు వచ్చినా, స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రభుత్వం తప్పిదాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డా బొంగు రమేష్​కోరారు.

Next Story

Most Viewed