- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పీఎం యోజన పేరుతో భారీ మోసం
by Sridhar Babu |

X
దిశ, జగిత్యాల ప్రతినిధి : పీఎం యోజన స్కీమ్ కింద రుణాలు ఇప్పిస్తానని నమ్మించిన ఓ వ్యక్తి రూ. 3 కోట్లకు పైగా స్వాహా చేశాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ కు చెందిన వేణు వర్మ పీఎం యోజన పథకం ద్వారా రుణాలు ఇప్పిస్తానని జగిత్యాలకు చెందిన అనేక మందిని నమ్మించాడు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది నుండి దాదాపు రూ.మూడు కోట్ల వరకు వసూలు చేశాడు.
వేణు వర్మ మాటలను నమ్మిన అనేక మంది బాధితులు రుణాల ఆశతో డబ్బులు బంగారం ముట్ట చెప్పారు. ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మందిని మోసం చేస్తూ నాలుగేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నట్లు బాధితులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం జగిత్యాలలో తీన్ ఖానీ చౌరస్తా వద్ద ఉన్న వేణు వర్మని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Next Story