వనస్థలిపురం టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

by Disha Web Desk 4 |
వనస్థలిపురం టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వనస్థలిపురం: వనస్థలిపురం ఆటోనగర్‌లో ఓ టైర్ల గోదాంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ఆటోనగర్‌లో ఉన్న ఓ గోదాంలో రీబటన్ టైర్లు నిల్వ చేశారు. ఇదిలా ఉండగా గురువారం అర్దరాత్రి ఒంటి గంట సమయంలో గోదాం నుండి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఆటోనగర్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలను ఆర్పివేశారు. గోదాంలో రీబటన్ టైర్ల సామగ్రి అధికంగా ఉండటంతో మంటలను ఆర్పడానికి మూడు ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలను ఆర్పివేశారు.ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


Next Story

Most Viewed