విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి..
X

దిశ, పరిగి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగి మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన సావాడ బిచ్చయ్య(48), మంగళవారం ఉదయం తన ఇంటికి విద్యుత్​ సరఫరా అయ్యే వైరుకు ఉన్న జియో వైర్​ కిందకు వేలాడుతూ కనిపించింది.

జియో వైరును చేతిలో పట్టుకొని సరిచేస్తూ ఉండగా స్తంభానికి విద్యుత్​ సరఫరా ఉన్న వైరుకు తగిలి విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబీకులు విద్యుత్​ సరఫరా నిలిపేశారు. అప్పటికే బిచ్చయ్య మృతి చెందాడు. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భర్త బిచ్చయ్య మృతి చెందాడంటూ భార్య యాదమ్మ ఆరోపించింది. యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed