మెట్ల మీద నుంచి కాలు జారి వ్యక్తి మృతి..

by Kalyani |
మెట్ల మీద నుంచి కాలు జారి వ్యక్తి మృతి..
X

దిశ, కోహెడ: ప్రమాదవశాత్తు మెట్ల మీద నుంచి కాలు జారి గజ్జల ఎల్లయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కోహెడ మండల కేంద్రంలో జరిగింది. మృతుని కొడుకు తెలిపిన వివరాల ప్రకారం.. 5 తేదీన తన సొంత ఇంటి పని కోసం ఇనుప మెట్ల ద్వారా బిల్డింగ్ మీదకు ఇసుక ను తీసుకొని వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి మెట్లపై నుండి కింద పడ్డాడు. తల వెనుక భాగం, పక్క ఎముకలు విరిగి బలమైన గాయాలు తగలడంతో కరీంనగర్ లోని శ్రీ సాయి లైఫ్ లైన్ హాస్పిటల్ కు తరలించారు. తలకు బలమైన గాయం తగలడం వల్ల చికిత్స కు అతని శరీర అవయవాలు సహకరించకపోవడంతో ఈరోజు చనిపోవడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. మృతునికి ఒక కొడుకు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తన తండ్రి మరణానికి ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు తెలిపారు.

Next Story

Most Viewed