ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

by Aamani |
ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
X

దిశ, మెట్ పల్లి/ఇబ్రహీంపట్నం : ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్ పల్లి పట్టణం గాజుల పేట కు చెందిన జక్కం భుమేష్, మఠం వాడకు చెందిన చింతల సాయిలు కలిసి సోమవారం ట్రాక్టర్ లో ఇసుక లోడును ఇబ్రహీంపట్నం లో అప్లోడ్ చేయడానికి వెళ్తే రేగుంట కెనాల్ దారిలో బోల్తా పడి భూమేష్ పై నుండి ట్రాక్టర్ వెళ్లగా అక్కడిక్కడే మృతి చెందగా సాయిలు కాలు విరిగిందని తెలిపారు. మృతుడు భూమేష్ భార్య మాధురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed