- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి..!
by Kalyani |

X
దిశ, పెద్దేముల్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం కోట బాసుపల్లి గ్రామానికి చెందిన ముద్దంగుల బాలకృష్ణ (28), కార్ డ్రైవింగ్ చేస్తూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామం కోట బాస్ పల్లి కి వస్తుండగా, పెద్దేముల్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లి తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. మృతికి గల కారణం అతివేగంగా, అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడపడంతోనే జరిగిందని తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దేముల్ ఎస్సై శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
Next Story