- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
దిశ,దుబ్బాక : అప్పుల బాధతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక లో చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై వి.గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల తిరుపతి(53) అనే వ్యక్తి బతుకుదెరువు నిమిత్తం 23 సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా దుబ్బాక పట్టణానికి వలస వచ్చి జీవనం కొనసాగిస్తూ, అప్పుచేసి ఇల్లు కొన్నాడు. దీనికితోడు ఇటీవల మరి కొంత అప్పు చేసి కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తూ, ఎలక్ట్రికల్ ఆటో కొన్నాడు. గత కొంతకాలంగా వ్యాపారం సరిగా జరగకపోవడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మానసికంగా కృంగిపోయాడు. దీంతో మద్యానికి బానిసగా మారి, అప్పులు తీర్చడం కంటే చావడం నయమని తరచూ కుటుంబ సభ్యులతో తన ఆవేదన వ్యక్తం చేసేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులతో అప్పులు తీర్చే మార్గం కనబడడం లేదంటూ బాధపడి, ఆటో తీసుకువస్తానని చెప్పి రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. దుబ్బాక నుంచి మల్లయ్య పల్లె వార్డుకు వెళ్లే రహదారి సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ భూమి వద్ద వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం జరిగిన ఘటనను గుర్తించిన స్థానిక రైతులు వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య శివలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.