- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చందానగర్ లో భారీ అగ్నిప్రమాదం

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్ మెయిన్ రోడ్డులోని సెంట్రో షోరూంలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. గతంలోనూ ఓసారి ఇదే బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందులోనే నూతనంగా సెంట్రోను ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం సెంట్రో నేమ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఆ మంటలు క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది షో రూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధం అయింది. అలాగే పక్కనే ఉన్న ఆర్ కే కలెక్షన్ షో రూమ్ కు మంటలు వ్యాపించాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే ఆ షోరూం కూడా అగ్నికి ఆహుతి అయింది. దాని పక్కనే వూమ్బ్ ఆస్పత్రికి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకోవడంతో సెంట్రో, ఆర్ కె కలెక్షన్ షోరూంలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఆర్ కె కలెక్షన్ పక్కనే వూంబ్ ఫెర్టిలిటీ ఆస్పత్రికి కూడా స్వల్పంగా మంటలు వ్యాపించగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అప్పటికే అప్రమత్తమైన అందులోని సిబ్బంది, రోగులను బయటకు తీసుకువచ్చారు. ఈ మంటల్లో ఆస్పత్రి ఏసీలు కొద్దిమేర దగ్ద అయ్యాయి. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వూంబ్ ఫెర్టిలిటీ ఆస్పత్రిలోని ఫైర్ సేఫ్టీ పైప్ లను ఆన్ చేసేందుకు యత్నించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఫైర్ సేఫ్టీ పైప్ లు నామమాత్రంగానే పెట్టారని, వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఫైర్ సేఫ్టీ సిబ్బంది తీవ్రంగా మండిపడ్డారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వచ్చిన వాహనాల్లోనూ నీరు అయిపోవడంతో జలమండలి ట్యాంకర్లను తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. అనంతరం బాహుబలి ఫైర్ ఇంజన్ ను తీసుకువచ్చి సుమారు 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. చందానగర్ మెయిన్ రోడ్డులో అగ్నిప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫైర్ సేఫ్టీ వాహనాలు వచ్చేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. జనాలు భారీగా గుమిగూడడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.