- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రగతినగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
by Sumithra |

X
దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ లో శనివారం ఓ కట్టెల షాప్ మండి, డెకొరేషన్ షాప్ వరకు షార్ట్ సర్క్యూట్ జరిగి భారీగా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కి, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చే వరకు కట్టెలు మండి, ఫ్లవర్ షాప్ దగ్ధం కావడంతో పాటు పక్కనే ఉన్న భవంతికి సైతం మంటల తాకిడి తగిలింది. దీంతో బిల్డింగ్ లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కట్టెల షాప్, ఫ్లవర్ షాప్ రెండు కూడా పూర్తిగా దగ్ధమైనా ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం సంభవించింది.
Next Story