అగ్నిప్రమాదంతో మొక్కజొన్న చేను దగ్ధం..

by Disha Web Desk 20 |
అగ్నిప్రమాదంతో మొక్కజొన్న చేను దగ్ధం..
X

దిశ, పర్వతగిరి (సంగెం) : వరంగల్ జిల్లా సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలో మొక్కజొన్న చేన్లో నిప్పు అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 50 ఎకరాల పంటకు నిప్పు అంటుకున్నట్టు స్థానికులు చెపుతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికి రాకముందే పంటచెను అగ్నిపాలైపోయిందని రైతులు లబోదిబోని గుండెలు బాదుకుంటున్నారు. డ్రిప్పు పైపులు, ఎడ్ల బండి కాలిపోయాయని స్థానికులు వాపోతున్నారు. లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు కంటతడి పెడుతున్నారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పేశారు. స్థానికులు తెలిపిన వివరాలు అనుముల మోహన్ తన చెలుకలో మొక్కజొన్న సొప్పను అంటిపెడుతున్న క్రమంలో అనుముల మోహన్ అగ్ని వేడికి, సూర్యుడి వేడికి స్పృహ తప్పి పోయాడు. అంతలో తన పొలం అంటుకుంటు చుట్టూ 50 ఎకరాల మొక్కజొన్న చేనులు అగ్నిపాలయ్యాయి. దీని వలన కౌలురైతులు మా పరిస్థితి ఏంటి అని బోరున ఎడుస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వం కౌలు రైతులను, రైతులను ఆదుకోవాలని నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed