ఓ ప్రేమ జంట ఇంట్లో ఒప్పుకోరనే భయంతో.. ఏం చేశారంటే

by GSrikanth |
ఓ ప్రేమ జంట ఇంట్లో ఒప్పుకోరనే భయంతో.. ఏం చేశారంటే
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ పెళ్లికి ఇంట్లో బప్పుకోరనే భయంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. బెంగళూరు సుల్తాన్‌పాళ్యకి చెందిన యశవంత్‌యాదవ్‌ (23), మనోరాయనపాళ్యవాసి జ్యోతి (23) ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటునట్టు సమాచారం. జ్యోతి బీకాం చేసింది. యశవంత్ కంప్యూటర్ కోర్స్ పూర్తి చేశాడు. కోన్ని రోజుల క్రితం ఇద్దరూ తమ ఇంట్లో ఉద్యోగం వచ్చిందని, మంగళూరుకు వెళ్లాలని, చెప్పి వచ్చారు. మంగళూరులో ఒక ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. యశవంత్‌యాదవ్‌ తన ఫ్రెండ్ దగ్గర కారు తీసుకుని ఇద్దరూ కలిసి ఉడుపికి వెళ్లారు. సమీపంలో ఉన్న దేవాలయం సంద్శరించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఇంట్లో ఒప్పుకోరు అనే భయంతో మార్గంమధ్యలో కారు ఆపి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో మంటల్లో కాలిపోయి ఇద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు.


Advertisement

Next Story

Most Viewed