మేకను చంపి కుండలో పెట్టి.. ఒప్పంద పత్రంతో క్షుద్రపూజలు

by samatah |
మేకను చంపి కుండలో పెట్టి.. ఒప్పంద పత్రంతో క్షుద్రపూజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా మూఢ నమ్మకాలు ఉన్నాయా అంటే అవును అంటున్నారు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు. టెక్నాలజీతో ప్రపంచం పరుగులు పెడుతున్న వేళ ఇంకా కొందరు పాతకాలం పద్ధతులతో అర్ధరాత్రి వేళ పూజలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా నారాణపేట జిల్లా కేంద్రంలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని మద్దూర్ మండలం, పల్లెర్లో మూగ జీవి అయిన మేకను చంపి కుండలో పెట్టి పూజలు చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పూజలు చేస్తున్న క్రమంలో కొందరు స్థానికులు గమనించి వారిని పట్టుకుని అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, కుండలో ఉన్నవాటిని చూసి ఒక్కసారిగా గ్రామస్తులు షాక్ అయ్యారు. అందులో మేకశవంతో పాటు, ఓ ఒప్పందం పత్రం కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రంలో ఆసక్తికలిగించే విషయాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసలు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed