చదివింది మాస్టర్స్ డిగ్రీ.. చేసేది గంజాయ్ రవాణా.. సీన్ కట్ చేస్తే..

by Disha Web Desk 19 |
చదివింది మాస్టర్స్ డిగ్రీ.. చేసేది గంజాయ్ రవాణా.. సీన్ కట్ చేస్తే..
X

దిశ, కోదాడ: ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తోన్న వ్యక్తి కోదాడ పోలీసులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కోదాడ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సుబాష్ లండ్లే పూణీ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ చదివి.. ఉద్యోగం దొరకక కారు డ్రైవర్‌గా మారాడు. డ్రైవర్‌గా వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకపోయాడు. ఇదిలా ఉండగా.. పుణేకు చెందిన ఆకాష్ ఉత్తమ్ రావు చౌహాన్ అనే వ్యక్తి అరకు నుండి గంజయా రవాణా చేస్తే రూ.10 వేలు ఇస్తానని ఆశ చూపాడు. దీంతో సుబాష్ అరకు నుండి గంజాయ్ తీసుకుని బయలుదేరాడు.

ఈ క్రమంలో గురువారం కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజీ వద్ద పట్టణ ఎస్ఐ నాగభూషణరావు సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్నోవా కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ను విచారించగా నేరము అంగీకరించి.. పూర్తి వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న గంజాయ్ విలువ 21 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు. అసలు నేరస్థుడు ఆకాష్ ఉత్తమ్ రావు చౌహాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నేరస్తుడి నుంచి గంజాయి, సెల్ ఫోన్, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.



Next Story