- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు శిక్ష
82 మందికి రూ.వేయి చొప్పున జరిమానా
దిశ, ఇబ్రహీంపట్నం : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన నలుగురికి మెట్ పల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ జైలు శిక్ష విధించినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన పతిరెడ్డి రాజారెడ్డి, తోపారపు భూమేష్, కోమటి కొండాపూర్ కు చెందిన రామగిరి సంతోష్, వర్షకొండకు చెందిన ఆవుల రంజిత్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇటీవల పట్టుబడ్డారు. వారిని మెట్ పల్లి కోర్టులో హాజరుపర్చగా రాజారెడ్డికి ఐదు రోజులు, మిగతా ముగ్గురికి మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా మిగతా 82 మందికి రూ.వేయి చొప్పున జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కేసుల్లో 12 మందికి రూ.వేయి చొప్పున రూ.12 వేలు జరిమానా వేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఉమాసాగర్ హెచ్చరించారు.