చీటింగ్ చేస్తూ చిక్కిన ఇరాన్ యువకులు.. టూరిస్ట్ వీసాతో..

by Disha Web Desk 13 |
చీటింగ్ చేస్తూ చిక్కిన ఇరాన్ యువకులు.. టూరిస్ట్ వీసాతో..
X

దిశ ప్రతినిధి, మెదక్: టూరిస్ట్ వీసాతో వచ్చిన ముగ్గురు ఇరాన్ యువకులు.. జిల్లాలో ఇద్దరు వ్యాపారులను చీటింగ్ చేసి, డబ్బులు కాజేసి పారిపోయిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఏఅర్ క్యాంప్ కార్యాలయంలో చిట్టింగ్‌కు సంబందించిన వివరాలను వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. ఇరానీ దేశానికి చెందిన కరీం(26), ఈవాజి నదేర్, బినియాజ్ బహమ్‌లు ముగ్గురు టూరిస్ట్ విసాపై దేశానికి వచ్చారు. ఢిల్లీలో కారు అద్దెకు తీసుకున్న వీరు హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో హోటల్‌లో గది అద్దె తీసుకొని ఉంటున్నారు. గత నెల 11న రామాయంపేట చికెన్ సెంటర్‌లోకి వచ్చి ఇరాన్ రియల్స్ చూపించి భారత నోట్లు చూపాలని కోరారు.

షాప్ యజమాని రూ. 90 వేలు చూపగా అతని చూపు మరల్చి అందులో ఉన్న 90 వేలు దోచుకొని వెళ్లిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కారు నంబర్ కూడా ఇచ్చాడు. ఆలాగే అక్టోబర్ 1న చేగుంటలో కూడా రూ. 25 వేలు దోచుకు వెళ్లారు. రెండు ఘటనలు ఒకే విధంగా ఉండటం పోలీస్‌కు తనిఖీలు చేశారు. రామయంపేట పోలీస్‌లు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఢిల్లీకి చెందిన వాహనం తనిఖీ చేయగా అందులో ఇరాన్ దేశానికి చెందిన ముగ్గురు ఉన్నట్లు నిర్ధారించారు. వారు వద్ద ఉన్న విసా ఆధారంగా టూరిస్ట్‌లుగా వచ్చినట్లు గుర్తించి విచారించగా అందులో ఒకరి వీసా గడువు ముగిసిందని ఎస్పీ తెలిపారు.

వారి వద్ద రూ 95 వేల భారతీయ నోట్లు, 850 అమెరికన్ డాలర్లు, 30,50,000 రీయల్స్, 3 సెల్ ఫోన్స్, 3 ఇరాన్ దేశపు పాస్ పోర్ట్ లు, రెండు ఇరాన్ దేశపు డ్రైవింగ్ లైసెన్స్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్పీ బాల స్వామి, డీఎస్పీ యాదగిరి రెడ్డి, నర్సాపూర్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, షేక్ మదార్, ఎస్ఐ లు పాల్గొన్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్‌లను అభినందించారు.


Next Story

Most Viewed