ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన.. విద్యార్థిని డ్రింకింగ్ వాటర్ బాటిల్లో మూత్రం

by Dishafeatures2 |
ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన.. విద్యార్థిని డ్రింకింగ్ వాటర్ బాటిల్లో మూత్రం
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ హైస్కూల్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని డ్రింకింగ్ బాటిల్ లో కొందరు ఆకతాయి విద్యార్థులు మూత్రం పోశారు. అయితే అది గమనించని ఆ విద్యార్థిని ఆ బాటిల్ లోని నీళ్లని తాగింది. తర్వాత తెలియడంతో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని భిల్వారా జిల్లా లుహరియా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ బాలికను అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడు తనను ప్రేమించాలంటూ వెంటపడతున్నాడు. అయితే అందుకు ఆ విద్యార్థిని పలుమార్లు నో చెప్పింది. దీంతో బాలుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. కాగా గత శుక్రవారం లంచ్ సమయంలో దాహం వాటర్ వేయడంతో ఆ విద్యార్థిని తన బ్యాగ్ లోని బాటిల్ మూత తీసి కొన్ని నీళ్లు తాగింది. అయితే నీళ్లు మూత్రం వాసన రావడంతో షాక్ తిన్నది. అలాగే ‘ఐ లవ్ యూ’ అంటూ రాసి ఉన్న ఓ లెటర్ ను కూడా ఆ విద్యార్థిని తన బ్యాగ్ లో కనుగొన్నది.

దీంతో వెంటనే ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనంతరం లుహరియా పోలీస్ స్టేషన్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న స్థానిక తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సోమవారం పాఠశాల తెరవగానే బాధితురాలి బంధువులు పాఠశాలకు వచ్చి గొడవకు దిగారు. అనంతరం నిందితుడి ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేసి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. కాగా ఈ విషయమై బాధితురాలు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, నిందితుడి ఇంటిపై రాళ్లతో దాడి చేసిన వాళ్లపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఏఎస్పీ ఘనశ్యామ్ శర్మ అన్నారు.



Next Story

Most Viewed