- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అత్యాశకు పోతే ఉన్న డబ్బులు పోయే

దిశ,ఎల్లారెడ్డిపేట : తమకు డబ్బులు ఇస్తే వాటికి ఏడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఆశ చూపిన నిందితుల మాటలు నమ్మి ఓ వృద్ధురాలు మోసపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లికి చెందిన లద్దునూరి సుందరవ్వ (69)కి ఇద్దరు కల్లబొల్లి మాటలు చెప్పి తమకు పది వేల రూపాయలు ఇస్తే సాయంత్రం వరకు 70 వేలు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బాధితురాలు పని నిమిత్తం ఇదే మండలం రాచర్ల గొల్లపల్లి నుండి ఇంటికి తిరుగు ప్రయాణం కాగా ఎప్పటి నుంచో కాపుకాసిన నిందితులు అమ్మా .. బాగున్నావా.. ఆరోగ్యం ఎలా ఉంది.
మందులు వాడుతున్నావా.. మీ పొలం దగ్గర బావి తవ్వడానికి వచ్చినాం. గుర్తు పట్టలేదా అని నమ్మబలికారు. తమకు పదివేల రూపాయలు ఇస్తే సాయంత్రం వరకు 70 వేలు ఇస్తామని నమ్మించారు. దాంతో ఆమె వారికి పది వేల రూపాయలు అప్పగించగా వారు సుందరవ్వ ను రాచర్ల గొల్లపల్లి వద్ద ఓ బ్యాంక్ వద్ద ఉంచి 70 వేల రూపాయలు తెస్తామని చెప్పి పరారయ్యారు. గతంలోనూ ఇదే విధంగా అదే గ్రమానికి చెందిన పెంజర్ల మల్లయ్యకు ఓ వ్యక్తి నీకు పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి ఏడు వేల రూపాయలు తీసుకుని మోసం చేశాడు. కాగా వరుస సంఘటనల పై పోలీసులు విచారణ జరిపి మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని స్థానికులు కోరుతున్నారు.