వ్యవసాయ పరికరాలు కనిపిస్తే ఖతమే

by Sridhar Babu |
వ్యవసాయ పరికరాలు కనిపిస్తే ఖతమే
X

దిశ, శంకరపట్నం : మండల పరిధిలోని పలు గ్రామాలలో వ్యవసాయదారుల మోటార్లు, పైపులు, వైర్లు వరుసగా చోరీకి గురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.... మండలంలోని నల్ల వెంకయ్యపల్లె గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్, సుభాష్ రెడ్డి అనే రైతులు మొలంగూర్ శివారులోని కాకతీయ కెనాల్ ఉపకాల్వ (3L) కు వ్యవసాయ పంపు సెట్లు బిగించుకొని పంట పొలాలకు నీరందిస్తున్నారు. రోజువారిగానే శనివారం ఉదయం వ్యవసాయ పంపుసెట్ల వద్దకు వెళ్లి చూడగా ఇరువురు రైతులకు చెందిన వ్యవసాయ పంపు సెట్లు చోరీకి గురైనట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.15 వేల వరకు ఉంటుందని రైతులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed