భర్త వివాహేతర సంబంధం.. పెళ్లైన 11 నెలలకే భార్య సూసైడ్

by Disha Web |
భర్త వివాహేతర సంబంధం.. పెళ్లైన 11 నెలలకే భార్య సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్: భర్త వివాహేతర సంబంధం టెక్కీ బలవన్మరణానికి కారణమైంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డన్ లో ఈ నెల 10న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. భర్త అభిషేక్ వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక భార్య శ్వేత(27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 11 నెలల క్రితమే వీరిద్దరికి వివాహం జరిగింది. భర్త టీసీఎస్ కంపెనీలో ఐటీ ఇంజనీరుగా పని చేస్తుండగా శ్వేత ఐబీఎం కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. పెళ్లికి ముందు అభిషేక్ కు ఓ యువతితో సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయమై భార్య భర్తలకు తరచూ గొడవలు జరిగాయి. అభిషేక్ తన పద్ధతి మార్చుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed