కుటుంబ తగాదాలతో.. భర్త చేతిలో భార్య హతం

by Mahesh |
కుటుంబ తగాదాలతో.. భర్త చేతిలో భార్య హతం
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. టీసీఓ క్లబ్ ఏరియాలో నివాసం ఉంటున్న సంక్రాంతి శంకర్ భార్య జ్యోతిని కుటుంబ కత్తితో పొడిచి హత్య చేశాడు. భీమిని ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్ గా పని చేసి ఇటీవల సస్పెండైన శంకర్ భార్య జ్యోతిల మధ్య కొంతకాలంగా నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి కూడా ఎప్పటిలాగే వారి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో చిన్న కొడుకు కిరణ్ ఇంట్లో లేకపోవడంతో ఇదే అదునుగా భావించి శంకర్ భార్యను కూరగాయల కత్తితో పొడిచాడు.

తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ తగాదాలే హత్యకు దారి తీశాయని ఏసీపీ వివరించారు. గొడవ సమయంలో శంకర్ చేతికి గాయాలైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed