ప్రాణం తీసిన మద్యం 'మత్తు'.. కన్నకూతురి ముందే తల్లి హత్య

by Disha Web |
ప్రాణం తీసిన మద్యం మత్తు.. కన్నకూతురి ముందే తల్లి హత్య
X

దిశ, గీసుగొండ: తాగిన మైకంలో భార్యను కర్రతో కొట్టి భర్త హతమార్చిన ఘటన గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి చెందిన తండా సుమన్‌తో వంచనగిరి గ్రామానికి చెందిన మానస(30)కు గత 15సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమారుడు రితిక్(14) కూతురు రితిక(12) ఉన్నారు. వంచనగిరిలో కుటుంబంతో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది సంవత్సరాల క్రితం సుమన్ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు.

ఈ క్రమంలో గురువారం గ్రామంలో గ్రామస్తులంతా వనభోజనాలకు వెళ్లారు. విపరీతంగా తాగి తాగిన మైకంలో ఇంటికి వచ్చిన సుమన్ మానసతో గొడవకు దిగాడు. పంచాయతీ పెద్దది కావడంతో కోపాద్రిక్తుడైన సుమన్ భార్య తలపై విచక్షణరహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తల్లి మృతి ఘటన కూతురు కళ్లముందే జరుగుతున్న ఆమె ఏడుస్తూ ఏం చేయలేని పరిస్థితిలో నిర్ఘాంతపోయినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని మామునూరు ఏసీపీ నరేశ్ కుమార్, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మృతురాలి సోదరి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా నిందితుడు సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed