భారీ గంజాయి పట్టివేత..4 గురు అరెస్ట్..పరారీలో మరో 5 గురు..

by Aamani |
భారీ గంజాయి పట్టివేత..4 గురు అరెస్ట్..పరారీలో మరో 5 గురు..
X

దిశ,కార్వాన్ : అక్రమంగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న 4 గురినీ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.ఎక్సైజ్ సూపరిండెంట్ అంజిరెడ్డి,మధు బాబు వివరాల ప్రకారం..కార్వాన్‌ టోలీ మజీద్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎండీ సలీం ఖాన్‌, ఎండి ఇంతియాస్‌ ఖాన్‌, వంశీకృష్ణ, సోనులు, కలిసి గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్,ఎస్టిఎఫ్ పోలీసులు శుక్రవారం సంయుక్త దాడులు నిర్వహించి 2.1కిలోల గంజాయి పట్టుకున్నారు. వారి వద్ద 6 సెల్ ఫోన్లు,4బైకులు, స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు విలువ 3 లక్షల వరకు ఉంటుందని, ఎండీ సలీం ఖాన్‌, ఎండి ఇంతియాస్‌ ఖాన్‌, వంశీకృష్ణ, సోనులు, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా, అమర్‌, సల్మాన్‌, నరేందర్‌, తుజ్లా సింగ్‌, కృష్ణ కుమార్‌లు పరారీలో ఉన్నారు. వీరితో పాటు మరో 31 మంది వినియోగదారుల పేర్లు చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ధూల్‌పేట్‌ సీఐ మధాుబాబు, గోపాల్‌, ఎస్టీఎప్‌ ఎస్సైలు లలిత, భాస్కర్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు భాస్కర్‌రెడ్డి, అజీమ్‌, శ్రీధర్‌, కానిస్టేబుళ్లు ప్రకాష్‌, వికాస్‌లను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed