కోలికోడ్‌లో దారుణం.. కాల్వలో పడేసిన సూట్‌కేస్‌లో సిద్ధిఖ్ శరీరభాగాలు

by Disha Web Desk 2 |
కోలికోడ్‌లో దారుణం.. కాల్వలో పడేసిన సూట్‌కేస్‌లో సిద్ధిఖ్ శరీరభాగాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రియుడితో కలిసి ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది ఓ ప్రియురాలు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా రంజిపాలెంలో జరిగింది.వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా ఆ మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో విసిరేశారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన వెనుక హానీ ట్రాప్ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిద్ధిఖ్ (58) అనే వ్యక్తి ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం నిమిత్తం అతను కుటుంబ సభ్యులకు దూరంగా కోజికోడ్ జిల్లాలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మే 18న కోజికోడ్ లోని ఎరంజిపాలేంలో ఉన్న ఓ హోటల్ లో సిద్ధిక్ రెండు గదులను బుక్ చేసుకున్నాడు. అయితే అదే హోటల్ లో పాల్కడ్ కు చెందిన నిందితులు శిబిల్ (22), ఫర్హానా(18)పై అంతస్తు గదిలో దిగారు.

ఆ మరుసటి రోజు శిబిల్, ఫర్హానాలు ఓ ట్రాలీ బ్యాగ్ తో తమ గదిలో నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్ లో కనిపించాయి. అంతకు ముందు తన కుమారుడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా సిద్ధిఖ్ ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ వచ్చింది. అదే సమయంలో తన తండ్రి ఏటీఎం నుంచి లక్ష విత్ డ్రా చేసిననట్లు మెసెజ్ రావడంతో అనుమానం పెరిగింది. దీంతో తన తండ్రి కనిపించలేదని సిద్ధిఖ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సీసీటీపీ ఫుటేజ్ ఆధారంగా శిబిల్, ఫర్హానాలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులకు సిద్దిఖ్ మధ్య ఇదివరకే పరిచయం ఉండటం, హత్యకు ముందు రోజు హోటల్ లో సిద్ధిక్ రెండు గదులు బుక్ చేయడంతో పాటు ఆయన ఏటీఎం నుంచి నిందితులు డబ్బులు విత్ డ్రా చేసుకోవడాన్ని బట్టి ఇది హనీ ట్రాప్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed